![]() |
![]() |

ఢీ డాన్స్ షో సంక్రాంతి సందర్భంగా సరికొత్తగా ముస్తాబై రాబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. హోస్ట్ నందు ట్రెడిషనల్ లుక్ లో కనిపించాడు. "ఢీలో ప్రతీ ఎపిసోడ్ పండగలా ఉంటుంది. అలాంటిది పండగ రోజే ఎపిసోడ్ అంటే" అంటూ ప్రోగ్రాంని స్టార్ట్ చేసాడు.
ఇక కంటెస్టెంట్స్ అంతా కూడా అదిరిపోయే గెటప్స్ లో వచ్చారు. భూమిక ఐతే "బావ నేను హర్ట్ అయ్యా" అంటూ ఆదికి చెప్పింది. "ఎందుకురా" అన్నాడు. "నువ్వు కదా మన్మధుడు నాగార్జున అంటారేంటి" అన్నది భూమిక. ఇక ఆది తెగ సిగ్గుపడిపోయాడు. వెంటనే పక్కనే ఉన్న ఝాన్సీ "బావ నేను కూడా హర్ట్ అయ్యా" అంది. "దేనికి" అన్నాడు. " రాజకుమారుడు నువ్వైతే మహేష్ బాబును అంటారేంటి" అంది. అంతే ఆది సిగ్గులమొగ్గయ్యాడు.
ఇక నందు కూడా హర్ట్ అయ్యానంటూ "బొకడాగాడు పండు ఐతే నిన్ను అంటారేంటి" అంటూ కామెడీ చేసాడు. "బావ నేను నీ కోసం చెరుకు తెచ్చా" అంటూ ఝాన్సీ ఇచ్చింది. "ఆ సూళ్లూరుపేట ఈవెంట్ లో స్టేజి పక్కన కొన్నావా ఏంటి" అంటూ ఆది ఆమె పరువు తీసేసాడు.
"ది ఓజి ఆఫ్ తెలుగు ఇండిపెండెంట్ పాప్ మ్యూజిక్" అంటూ సింగర్ స్మితని, నోయెల్ ని స్టేజి మీద ఇన్వైట్ చేసాడు నందు. తర్వాత స్మిత "మసక మసక" సాంగ్ పాడింది. తర్వాత ఒక ఇంటరెస్టింగ్ సెగ్మెంట్ పెట్టారు. ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేస్తున్నారు దానికి సంబంధించి పిక్చర్స్ ఉన్నాయంటూ భూమిక, విజయ్ బిన్నీ మాస్టర్ పిక్స్ ని ప్లే చేసారు. "భూమిక గాలిపటాలు నువ్వు ఎగరేసావా మాష్టారా, ఐనా అక్కడ భూమికా ఉన్నా కూడా మాష్టర్ మాత్రం రెజీనా కోసం వెతుకుతున్నారు" అని ఆది అనేసరికి విజయ్ బిన్నీ మాష్టర్ షాకయ్యాడు.
తర్వాత ఆది పిక్చర్ ఉన్న గాలిపటం ఒక బెడ్ మీద ఉండేసరికి "నిన్ను గాలిలో ఎగరవయ్య అని గాలిపటం తీసుకుని వేస్తే బెడ్ రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా" అంటూ ఆదిని అడిగాడు నందు. "ఎగిరే ఓపిక లేక అక్కడే సెటిల్ అయ్యా" అని చెప్పాడు ఆది.
![]() |
![]() |